సిటీబ్యూరో, జులై 3 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్-36లో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ తొలి స్టోర్‌ను ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పలువురు మోడల్స్ సరికొత్త ఆభరణాలను ధరించి సందడి చేశారు.
కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ వైష్ణవి, సీఈవో సింధూజ, డైరెక్టర్లు శ్రీనివాసరావు, రవికుమార్, రితేశ్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.