జూబ్లీహిల్స్, సెప్టెంబర్9: రహ్మత్‌నగర్ వీడి యో గల్లీ, గురుద్వారా ప్రాంతాల్లో కలుషిత నీటి తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. కొన్ని రోజులుగా డ్రైనేజీ నీటితో కలిసిన నీరు సరఫరా అవుతుండటంతో అవస్థలు పడుతున్నామని తెలిపారు. మురికి నీరు సరఫరా అవుతుందని వాటర్ వర్క్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కలుషిత నీటితో వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు స్పందించి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు.