బొల్లారం,ఆగస్టు 19 : కంటోన్మెంట్ పోలీసులు మరోమారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని లోతుకుంటలో ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యాచకుడు రోడ్డు పై పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న బొల్లారం పోలీసులు గమనించి తన దీనస్థితిని చూసి పలుకరించారు. ఆకలితో అల్లాడుతున్న అతడికి ఏఎస్సై రామచందర్, పెట్రోల్ మొబైల్ 1 సిబ్బంది ఆహారం అందజేశారు. ఈ సంఘటన చూస్తూ..రోడ్డుపై వెళ్తున్న వారు పోలీసుల దాతృత్వాన్ని చూసి ఫిదా అయ్యారు.