సైబరాబాద్‌కు రెండు ప్రత్యేక జాగిలాలు
తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగం నుంచి రెండు పోలీస్ జాగిలాలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు రిపోర్ట్ చేసినట్లు సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ హనుమంతరావు తెలిపారు. కొత్తగా చేరిన ఈ రెండు కేనైన్(జాగిలాలు)లతో కలిపి ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ జాగిలాల సంఖ్య 18కి చేరింది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సీఐడీ విభాగం నుంచి రెండు పోలీస్ జాగిలాలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు రిపోర్ట్ చేసినట్లు సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ హనుమంతరావు తెలిపారు. కొత్తగా చేరిన ఈ రెండు కేనైన్(జాగిలాలు)లతో కలిపి ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ జాగిలాల సంఖ్య 18కి చేరింది. ఈ జాగిలాలలో 12 కేనైన్‌లు పేలుడు పదార్థాల గుర్తింపు కోసం, రెండు కేనైన్లను మాదకద్రవ్యాల గుర్తింపునకు, మరో నాలుగు కేనైన్లను ట్రాకర్ జాగిలాలుగా సేవలు అందిస్తున్నట్లు అదనపు డీసీపీ వివరించారు.
సీఐడీ నుంచి కొత్తగా రిపోర్ట్ చేసిన కేనైన్లలో 4ఏండ్ల వయస్సు గల ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), 10ఏండ్ల వయస్సుగల ‘రాడో’ (లాబ్రడార్) ఉన్నట్లు తెలిపారు. నేరాల ఛేదన, పేలుడు పదార్థాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఈ కేనైన్‌లు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఏడీసీపీ చెప్పారు. బీడీ టీమ్ ఆర్ఐ నాగరాజు సారథ్యంలో, ఆర్ఎస్ఐ వెంకటేష్ సహకారంతో ఈ కేనైన్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకొస్తామని ఏడీసీపీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

