IBomma Ravi | ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. అందులో కీలక విషయాలను వెల్లడించారు. రవి రెండు రకాలుగా సినిమా ప్రింట్‌ను కొనుగోలు చేసేవాడని పోలీసులు తెలిపారు. నార్మల్ ప్రింట్కు 100 డాలర్లు, హెచ్డీ ప్రింట్కు 200 డాలర్లు చెల్లించాడని పేర్కొన్నారు. కొవిడ్ తర్వాత బిజినెస్ పెరిగిందని రవి చెప్పాడని పోలీసులు రిపోర్టులో చెప్పారు.
రవికి సంబంధించిన ఏడు ఖాతాలకు రూ.13.40 కోట్లు వచ్చాయని పోలీసులు కస్టడీ రిపోర్టులో తెలిపారు. బెట్టింగ్ యాడ్ల ద్వారా రూ.1.78 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. రవి సోదరి చంద్రికకు రూ.90 లక్షలు పంపాడని అన్నారు. లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే చేసేవాడని తెలిపారు. రాకేశ్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందాడని పేర్కొన్నారు. కొంతకాలం కూకట్‌పల్లిలోనే ఆఫీసు నడిపించాడని చెప్పారు. బెట్టింగ్, పైరసీల ద్వారా వచ్చిన డబ్బులతో రవి జల్సాలు చేసేవాడని పేర్కొన్నారు.