హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని (Nursing student) అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. శృతిది రేప్ అండ్ మర్డర్ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తేల్చారు. ఈ నెల 16న జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థిని శ్రుతి (23) గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. హోటల్ రూమ్‌లో బీర్ బాటిళ్లు, గోడలకు రక్కపు మరకలు ఉండడం, అంతా చిందరవందరగా ఉండటంతో గొడవ జరిగి ఉంటుందని అనుమానించారు. మరోవైపు.. శ్రుతిపై హత్యాచారం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెది ఆత్మహత్యేనని నిర్ధారించారు. ఆమె గత కొంతకాలంగా జీవన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని, అయితే పెండ్లికి అతడు నిరాకరించాడని తెలిపారు. దీంతో మాట్లాడుకునేందుకు ఇద్దరూ హోటల్‌కు వెళ్లారని, అక్కడ మాటామాటా పెరిగి.. ఇద్దరూ గొడవ పడ్డారని చెప్పారు. జీవన్ తన తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోగా, శ్రుతి పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుందని పేర్కొన్నారు. జీవన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.