హైదరాబాద్: హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న ఓ పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అసభ్యకర నృత్యాలు చేస్తున్న 17 మంది యువతులను అరెస్టు చేశారు. చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్ (Wild Hearts Pub) సమయానికి మించి నడుస్తున్నదంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పబ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో యువతులతో అభ్యంతకర నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు.
17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ముంబై నుంచి తీసుకొచ్చారని, కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్స్ చేయిస్తున్నారని తెలిపారు. పబ్ నిర్వాహకులు, వినియోగదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.