మియాపూర్, నవంబరు 7 : మియాపూర్‌లో ఫుట్ పాత్ ఆక్రమణలను శుక్రవారం పోలీసులు తొలగించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ నుంచి హెచ్‌టీ లైన్ పైప్‌లైన్ రోడ్డు వరకు ఇరువైపులా ఫుట్‌పాత్‌పై నెలకొన్న షాపుల బోర్డులను తొలగించారు.
పాదచారుల సౌకర్యంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఫుట్‌పాత్‌పై ఆక్రమణలను తొలగిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. అంతరాయం లేని ట్రాఫిక్ కొనసాగింపు కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.