జగద్గిరిగుట్ట: బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ ఏసీపీ నరేశ్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి, ఆల్విన్‌కాలనీలో నివాసముండే శ్రీధర్ , వీరకౌశిక్గౌడ్, మణికంఠ, శ్రీనివాస్ జల్సాలకు అలవాటు పడి.. బైక్‌లు చోరీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేటకు చెందిన నాగూర్వలి(25) సాయంతో కొట్టేసిన బైక్‌లు అమ్మేవారు.
ఇటీవల వాహన తనిఖీలు చేస్తున్న జగద్గిరిగుట్ట పోలీసులకు చోరీ చేసిన బైక్‌పై వెళ్తూ శ్రీధర్ పట్టుబడ్డాడు. బండి పత్రాలు సరిగా చూపెట్టకపోగా, గతంలో హత్యాయత్నం కేసులోనూ అతడు నిందితుడిగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. బైక్ చోరీల వివరాలు వెలుగుచూశాయి.నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేసి..22 బైక్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు.