కాచిగూడ, మే 24 : ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం కాచిగూడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పుమండలం అడిషినల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించా రు. నీరజ్ జైన్, అమిత్సర్ధా, నారాయణదాస్ గత కొన్ని రో జులుగా కాచిగూడ చెప్పల్‌బజార్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వెస్ట్‌జోన్ టాస్క్‌పోర్స్, కాచిగూడ పోలీసులు సోమవారం రాత్రి దాడిచేసి పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.25 వేలు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ యాదేందర్, వెస్ట్‌జోన్ టా స్క్పోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై రవికుమార్ ఉన్నారు.