పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
బంజారాహిల్స్, జూన్ 2: బాలికను కారులో బలవంతంగా ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేసిన ఘటనలో ఇద్ద రు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 14లో ఉంటున్న రుమేనియాకు చెందిన బాలిక (16) గత నెల 28న తన ఇంటి పక్కన ఉంటున్న హదీతో కలిసి అమ్నీషియా పబ్‌కు వెళ్లింది. అక్కడ హదీ స్నేహితులైన మరో ముగ్గురు పీకలదాకా మద్యం సేవించారు. సాయంత్రం హదీ తన స్నేహితుడు సూరజ్‌తో కలిసి బాలికను కారులో ఎక్కించుకొని బయలుదేరారు. వారితో పాటు మరో ముగ్గురు సైతం ఎక్కారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారు. హదీ, సూరజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు.