పబ్‌లో పార్టీలు ఎన్ని జరిగాయి
నేరస్థుల గత చరిత్రపై పోలీసుల ఆరా
పబ్ నిర్వాహకులపై చర్యలకు అవకాశం
సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో అరెస్టు అయిన ఆరుగురు నిందితుల్లో మేజర్ అయిన సాదుద్దీన్మాలిక్ను నాలుగు రోజుల పాటు న్యా యస్థానం విచారణ నిమిత్తం కస్టడీకి అనుమతించింది. మిగతా వాళ్లంతా జ్యువెనల్స్ కావడంతో వాళ్ల కస్టడీకి పోలీసులు ప్రత్యేక పిటిషన్ వేయనున్నారు. గత నెల 28న పబ్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన పూర్వ పరాలను ఆరా తీసిన పోలీసులు, పార్టీ అనంతరం జరిగిన అఘాయిత్యంపై క్షుణ్నంగా ఆరా తీశారు.
నిమిషం, నిమిషం ఏమి జరిగిందనే విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన విషయం తెలిసిందే. మైనర్లను పబ్‌లోకి అనుమతించవద్దని నిబంధనలున్నా, నాన్ అల్కాహాలిక్ పార్టీ పేరుతో పార్టీ ఏర్పాటుకు పబ్ నిర్వాహకులు అనుమితిచ్చారు. దీనిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.