సైదాబాద్, జూన్ 2 : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ వృద్దుడు (70)కి హైదరాబాద్ పోక్సో ప్రత్యేక కోర్డు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. 202 3లో మే 11న గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని ఓ కిరాణా దుకాణానికి వెళ్లి న మైనర్‌ను నిందితుడు మహమ్మ ద్ జమీరుద్దీన్ (70) లోపలికి పిలిచి దాడికి పాల్పడి, బెదిరింపులకు గురిచేశాడు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు విచారణ జరిపారు. పోలీసులు పటిష్టమైన ఆధారాలతో కోర్టులో అభియోగాలు నిరూపించారు. ఈ మేరకు కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.