నోయిడా: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జేవర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రధాని సందర్శన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రూ.11,200 కోట్ల అంచనా వ్యయంతో ఈ విమానాశ్రయం తొలి దశను నిర్మించారు.
రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థల ద్వారా నిరంతరాయ అనుసంధానంతో మల్టీ మోడల్ రవాణా హబ్‌గా దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టులో మల్టీ మోడల్ కార్గో హబ్ కూడా భాగం. ఏడాదికి 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కార్గోను ఇది ప్రాథమికంగా నిర్వహించగలదు. దీన్ని దాదాపు 18 లక్షల మెట్రిక్ టన్నుల వరకు విస్తరించే అవకాశం ఉంటుంది.ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిన సవాళ్లను మన దేశం సమర్థంగా ఎదుర్కొంటున్నదన్నారు.