ఉప్పల్‌లో హత్య కుట్ర భగ్నం
ఉప్పల్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు పథకం రచించిన ఐదుగురు నిందితులను ఉప్పల్, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు నాటు తుపాకులు, 8 బుల్లెట్లు, మూడు కత్తులు, రెండు హోండా యాక్టివా సూటర్లు, ఒక ఆటోరిక్షా, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు
-
ఐదుగురు నిందితులు అరెస్ట్ ..
-
రెండు నాటు తుపాకులు,
-
8 బుల్లెట్లు, 3 కత్తులు స్వాధీనం
సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు పథకం రచించిన ఐదుగురు నిందితులను ఉప్పల్, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు నాటు తుపాకులు, 8 బుల్లెట్లు, మూడు కత్తులు, రెండు హోండా యాక్టివా సూటర్లు, ఒక ఆటోరిక్షా, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుమతి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
ముసీ నది సమీపంలో అనుమానాస్పదంగా…
నవంబర్ 2న ఉదయం ఉప్పల్ పోలీసులు, ఎస్ఓటీ బృందం కలిసి సంయుక్తంగా సాధారణ పెట్రోలింగ్ నిర్వహించారు. ఉదయం 6.45 గంటల సమయంలో ఉప్పల్ శిల్పారామం వెనుక ముసీ నది సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, ఇద్దరి వద్ద రెండు నాటు తుపాకులు, 8 బుల్లెట్లు, మూడు కత్తులు లభించాయి. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అర్ఫాజ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు.
పాత హత్యల నేపథ్యంలోప్రతీకార కుట్ర
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితులందరికీ దాసరి సురేందర్ అలియాస్ సూరితో పరిచయం ఉంది. సురేందర్ తన భార్య షబాకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుడా 2024లో షబా సోదరుడు సల్మాన్‌ను కూడా సూరి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ హత్యలకు ప్రతీకారంగా షబా రెండో సోదరుడు అర్ఫాజ్ 2026 జూలైలో సురేందర్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మీర్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఇటీవల జైలు నుంచి విడుదలైన అర్ఫాజ్ను హత్య చేసి సురేందర్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని సురేందర్ అనుచరులు పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఐదుగురు నిందితులు కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.
బీహార్ నుంచి తుపాకుల కొనుగోలు ..
హత్య కుట్రలో భాగంగా తనయ్కుమార్ అలియాస్ కన్నా, షేక్ అక్బర్లు కలిసి ఆదిత్య కుమార్ ఠాకూర్‌కు ఫోన్ పే ద్వారా రూ.35 వేల నగదు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదిత్య కుమార్ ఠాకూర్ బిహార్‌లోని భాగల్పూర్ జిల్లా సైద్పూర్ దబ్రా ప్రాంతానికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.30 వేలకు రెండు నాటు తుపాకులు, ఆరు బుల్లెట్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అదనంగా మూడు కత్తులను కూడా కొనుగోలు చేసిన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నవంబర్ 2న ఉదయం మూసీ నది సమీపంలో ఐదుగురు నిందితులు సమావేశమై అర్ఫాజ్ హత్యకు సంబంధించిన ప్రణాళికను చర్చిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వివరించారు.
అరెస్టయిన నిందితులు వీరే..
ఉప్పల్‌లోని భారత్ నగర్‌కు చెందిన తోకట తనయ్ కుమార్ అలియాస్ కన్నా(26) లోన్ రికవరీ ఏజెంట్, మీర్‌పేటలోని నందనవనం ప్రాంతానికి చెందిన షేక్ అక్బర్(26) ఆటో డ్రైవర్, బిహార్‌లోని భాగల్పూర్కు చెందిన ఆదిత్య కుమార్ ఠాకూర్ (33), దుదాని లక్ష్మణ్ సింగ్ అలియాస్ సోను (27) వెల్డింగ్ కార్మికుడు, నల్గొండ జిల్లాకు చెందిన వడ్త్యా వెంకటేశ్ అలియాస్ నాని (22) ఆటోడ్రైవర్. సోను చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్. ఇతడిపై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందులో రెండు హత్యకేసులతో పాటు దొంగతనం, దోపిడీలు, ఆయుధ చట్టం, ఎన్డీపీఎస్ చట్టానికి సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, 8 బుల్లెట్లు , మూడు కత్తులు, రెండు హోండా యాక్టివా సూటర్లు, ఒక ఆటోరిక్షా, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

