సిటీబ్యూరో: ప్రస్తుత పాలక మండలి గడువు పట్టుమని రెండు నెలలు కూడా లేదు కానీ..ఇతర నగరాల్లో స్టడీ టూర్ అంటూ సిద్ధమయ్యారు. ఇప్పటికే పీకల దాక అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ పరిస్థితి దినదిన గండంగా నెట్టుకొస్తున్న తరుణంలో స్టడీ టూర్లకు కార్పొరేటర్లు ప్లాన్ చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల విజ్ఞప్తిపై స్పందించిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి స్టడీ టూర్‌కు ఆమోదం తెలపడం..చకచకా ఈ నెల 29న జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇప్పటికే రెండు దఫాలుగా స్టడీ టూర్లకు వెళ్లిన కార్పొరేటర్లు తాజాగా అహ్మదాబాద్, చండీఘడ్ నగరాల్లో సడీ టూర్‌కు ప్లాన్ చేయడం గమనార్హం.
కాగా, స్టాండింగ్ కమిటీ సమావేశంలో మొత్తం 15 అంశాలతో కూడిన అజెండా కమిటీ ముందుకు రానుంది. వీటిలో 14(ఏ) ఐటమ్ గా స్టడీ టూర్‌ను కమిటీ ముందు పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ స్టడీ టూర్‌కు రూ. కోటిన్నర వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తున్నది.