e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home హైదరాబాద్‌ వయసులో చిన్న సేవలో మిన్న

వయసులో చిన్న సేవలో మిన్న

వయసులో చిన్న సేవలో మిన్న
 • కరోనా కాలంలో వృద్ధులను ఆదుకుంటున్న ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన విద్యార్థి
 • ప్రతిరోజు ఉదయమే ఇమ్యూనిటీ బూస్టర్‌, ఆల్కలైన్‌ వాటర్‌ అందిస్తున్న ముచుకుంద
 • లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇతర రాష్ర్టాల కూలీలకు చేయూత..

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 5 : కరోనా విజృంభిస్తున్న వేళ సమాజానికి తనవంతు సాయం చేయాలనుకుంది ఆ విద్యార్థి. ఆలోచన వచ్చిందే తడువుగా ఇంట్లో వారికి విషయం చెప్పింది. వారు సరే ఒప్పుకొని తాను చేసే సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని చేతులు కలిపారు. ఇంకేముంది కొంతమంది కరోనా రోగులకైనా ఇమ్యూనిటీ బూస్టర్‌ను అందించాలని నిర్ణయించుకుంది ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన పిట్టల ముచుకుంద(మూసీ).

నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి..

 • రోడామిస్త్రి కాలేజీలో బీఎస్‌డబ్ల్యూ చదువుతున్న ముచుకుంద తన ఇంటిలోనే ప్రో బయోటిక్‌గా పని చేసే రాగి అంబలి, ఆక్సిజన్‌ పెంచే ఆల్కలైన్‌ వాటర్‌ను తయారు చేస్తున్నది.
 • తన తమ్ముడు శివతో కలిసి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అంకుషాపూర్‌కు ఉదయమే పది లోపే చేరుకుంటుంది.
 • నెల రోజులుగా అక్కడ ఉన్న వృద్ధులకు వాటిని అందిస్తున్నది.
 • అంతేకాక కచీర్‌ వద్ద కూర్చొనే వృద్ధుల కోసం కూలర్‌ను ఏర్పాటు చేసింది.

నాన్నే ఆదర్శంగా..

మా నాన్న పిట్టల శ్రీశైలాన్ని ఆదర్శంగా తీసుకొని కష్టాల్లో ఉన్న వారికి నా వంతు సాయం చేస్తున్నా. నాన్న సహకారంతో లాక్‌డౌన్‌ సమయంలో ఎందరో కూలీల ఆకలి తీర్చా. కరోనాపై స్థానికులకు అవగాహన కల్పించడంతో పాటు ప్లాస్మా దానం చేసే వారిని గుర్తించాం. వారితో ప్లాస్మా ఇప్పించగా ఎందరో ఊపిరి పోసుకున్నారు. – పిట్టల ముచుకుంద

కరోనా వారియర్‌గా..

 • కరోనా వచ్చిందని తెలియగానే భయంతో వణికిపోతున్న సమయంలో ముచుకుంద కరోనా వారియర్‌గా మారింది.
 • గత సంవత్సరం సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పిలుపు మేరకు ప్లాస్మా డోనర్ల క్యాంపులో వలంటీర్‌గా చేరింది.
 • అనేక సేవలు చేసింది. గతంలో లాక్‌డౌన్‌ విధించిన సందర్భంలో పేదలు, ఇతర రాష్ట్ర కూలీలకు వైయస్‌ రెడ్డి ట్రస్ట్‌ ద్వారా నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, పండ్లు పంపిణీ చేసింది.
 • సికింద్రాబాద్‌, బీబీనగర్‌, ఘట్‌కేసర్‌ రైల్లే స్టేషన్ల నుంచి సొంత గ్రామాలకు వెళ్తున్న కూలీలకు తన సోదరి తెలంగాణ కోకిలతో కలిసి చేదోడువాదోడుగా నిలిచింది.
 • ఈ కష్టకాలంలో పెద్ద మనసుతో ముచుకుంద చేస్తున్న సేవలను పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వయసులో చిన్న సేవలో మిన్న

ట్రెండింగ్‌

Advertisement