MGIT | మణికొండ, మే 30 : మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నకేవీ కాశీ విశ్వనాథంకు హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆప్టిమైజేషన్ ఆఫ్ ప్రాసెస్ పారామీటర్స్ ఇన్ టర్నింగ్ ఆఫ్ గ్లాస్ ఈపాక్సి కాంపోజిట్ ఫిల్డ్ విత్ సిలికాన్ కార్బైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అనే అంశంపై జేఎన్టీయూహెచ్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎసిఎస్ కుమార్, సిబిఐటి ప్రొఫెసర్ డాక్టర్ పి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేసి థిసీస్‌ను సమర్పించినందుకు గాను కేవీ కాశీ విశ్వనాథంకు ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంజిఐటి అధ్యాపకులు, ప్రిన్సిపాల్ చంద్రమోహన్ రెడ్డి ఆయనను అభినందించారు.