హిమాయత్‌నగర్: కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతోనే దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టీ. నరసింహ ఆరోపించారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం హిమాయత్‌నగర్ వై జంక్షన్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిలిండర్, ఆటోకు తాళ్లు కట్టి గుంజుతూ వినూత్న నిరసన చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.