బంకుల్లో బ్లాక్ దందా
పెట్రోల్ బంకుల బ్లాక్ దందా జోరుగా సాగుతుంది. లీటర్ పెట్రోల్, డీజిల్ రూ. 5 పెంచి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు అంటున్నారు.
- లీటర్‌కు రూ. 5 పెంపు..ఖాళీ డబ్బాల్లో విక్రయం
మేడ్చల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): పెట్రోల్ బంకుల బ్లాక్ దందా జోరుగా సాగుతుంది. లీటర్ పెట్రోల్, డీజిల్ రూ. 5 పెంచి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు అంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ పెట్రోల్ బంకుల యజమానులు కావాలనే కృతిమంగా కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఖాళీ డబ్బాల్లో విక్రయించవద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చినా బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. బంకుల బయట నో స్టాక్ బోర్డులను పెట్టి ఖాళీ డబ్బాల్లో విక్రయిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని పెట్రోల్ బంకులను డీఎస్వో శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. కృతిమ కొరత సృష్టిస్తున్నట్లు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు బంకులను పర్యవేక్షించారు.
పెట్రోల్, డీజిల్ కొరత లేదు
జిల్లాలోని బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. జిల్లాలో వివిధ పెట్రోల్ బంకులను ప్రతి రోజు పరిశీలిస్తున్నాం. ప్రతి రోజు వినియోగానికి సరిపడే విధంగా పెట్రోల్, డీజిల్‌లు వివిధ కంపెనీలు పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తున్నాయి.
– శ్రీనివాస్‌రెడ్డి,డీఎస్వో
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

