High Court | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : విదేశాల్లో ఉన్న అల్లుడిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న తన కుమార్తెను అల్లుడు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, అల్లుడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బి.విజయ్ సేన్రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ కుమార్తె భారత పౌరురాలిగా ఇకడి పోలీసుల నుంచి రక్షణ పొందే హకు ఉందని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ పిటిషన్ విచారణార్హత ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
ఏవైనా అభ్యంతరాలంటే అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వ న్యాయవాది కూడా పిటిషన్ విచారణార్హం కాదనగా న్యాయమూర్తి విచారణను 8కి వాయిదా వేస్తూ విచారణార్హతపై వివరణ ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేశారు.