కోట్ల విలువైన స్థలం.. అప్పనంగా కట్టబెట్టారు!
కేబీఆర్ పార్కు గేట్ నెంబరు 5 వద్ద ఉన్న అత్యంత ఖరీదైన స్థలాన్ని కుక్కల క్షవరం(గ్రూమింగ్) చేసే ‘పెట్ఫోక్' అనే ప్రైవేట్ సంస్థకు జీహెచ్ఎంసీ కట్టబెట్టింది. సంబంధిత స్థలాన్ని చాలా నామమాత్రపు అద్దెకు ఇచ్చారు. పార్కుకు ఎదురుగా ఉన్న ప్రైవేట్ భవనాలకు చదరపు అడుగుకు నెలకు రూ.200ల చొప్పున అద్దె వసూలు చేస్తుండగా, జీహెచ్ఎంసీ మాత్రం 900 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు కేవలం రూ. 15వేల అద్దె చొప్పున ఏడాది కాలానికి కేటాయించింది.
- కేబీఆర్ పార్కు వద్ద పెట్ఫోక్కు నామమాత్రపు అద్దె
- వేలం లేకుండానే అప్పగించడంపై విమర్శలు
- చక్రం తిప్పిన ఎస్టేట్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి
సిటీబ్యూరో: కేబీఆర్ పార్కు గేట్ నెంబరు 5 వద్ద ఉన్న అత్యంత ఖరీదైన స్థలాన్ని కుక్కల క్షవరం(గ్రూమింగ్) చేసే ‘పెట్ఫోక్’ అనే ప్రైవేట్ సంస్థకు జీహెచ్ఎంసీ కట్టబెట్టింది. సంబంధిత స్థలాన్ని చాలా నామమాత్రపు అద్దెకు ఇచ్చారు. పార్కుకు ఎదురుగా ఉన్న ప్రైవేట్ భవనాలకు చదరపు అడుగుకు నెలకు రూ.200ల చొప్పున అద్దె వసూలు చేస్తుండగా, జీహెచ్ఎంసీ మాత్రం 900 చదరపు అడుగుల స్థలాన్ని నెలకు కేవలం రూ. 15వేల అద్దె చొప్పున ఏడాది కాలానికి కేటాయించింది. ఇటీవల ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అయితే ఇక్కడే కొందరు ఎస్టేట్ విభాగం అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
ముఖ్యంగా ఎస్టేట్ విభాగంలో ఓ ఉన్నతాధికారి తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి బహిరంగ వేలం ద్వారా కేటాయించాలనే నిబంధనను తుంగలో తొక్కి నామమాత్రపు అద్దెకు అప్పనంగా కట్టబెట్టిన తీరుపై విమర్శలకు తావిస్తున్నది. పెంపుడు కుక్కలకు క్షవరం, మసాజ్ సేవలు అందించే ఈ సంస్థకు కాలిబాట పక్కన ఉన్న సుమారు రూ. 5కోట్ల విలులైన స్థలాన్ని నామమాత్రపు అద్దెకు కేటాయించారని వాకర్లు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

