Harish Rao | కేసీఆర్ స్థాయి ఏందో రేవంత్ రెడ్డిస్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ మీడియా సమావేశంలో హరీష్రావు మాట్లాడుతూ.. వివిధ సోషల్ మీడియా ప్టాట్ఫామ్స్లో కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్లో 36 లక్షల మంది చూశారు. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారు. కేసీఆర్ వ్యూయర్ షిప్లో పది శాతం కూడారేవంత్ రెడ్డి వ్యూయర్ షిప్ లేదు. అంటే ప్రజలు కేసీఆర్ పట్ల ఎంత గౌరవంగా ఉన్నరు. రెండున్నరేళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమైందని హరీష్ రావు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో 2 వేల మంది కేసీఆర్ లైవ్ చూస్తుంటే.. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో రేవంత్రెడ్డి లైవ్ 54 మంది చూసిర్రు. రేవంత్ రెడ్డి తెలిసి చేసిండో తెలియక చేసిండో తెలియదు కానీ ఒకే సమయంలో చేయడం వల్ల దాని రేటింగ్, దీని రేటింగ్ ఎంత..? ఎవరి రేటింగ్ ఎంతో అర్థమైపోయింది. కేసీఆర్ స్థాయి ఏందో రేవంత్ రెడ్డి స్థాయి ఏందో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు.
కేసీఆర్ గారు మాట్లాడే సమయానికే మాట్లాడడం వల్ల రేవంత్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది
కేసీఆర్ గారి ప్రసంగాన్ని 36 లక్షల మంది చూస్తే, రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మంది చూసారు అంటే 10% కూడా కాదు – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు pic.twitter.com/bd0gYnn0wA
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2026
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు