సిటీబ్యూరో, జవహర్‌నగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రశాంతవంతమైన ప్రాంతల్లోనే ప్రజలు అనేక రకాల రోగాలతో ప్రజలు ఉకిరిబికిరవుతున్నారు. అలాంటిది జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ చుట్టూ నివసించే ప్రజల అవస్థలు మాటల్లో చెప్పలేం. జెడ్ స్పీడ్ వేగంతో డంపింగ్ ప్రాంతాలు కాలుష్యం కోరల్లో చికుకున్నాయి. దుర్వాసనను భరించలేక ప్రజలు ఇంటికే పరిమితమైన రోజులు కోకొల్లాలు. స్థానిక ప్రజలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన రాంకీ యాజమాన్యం పట్టించుకోకుండా… ప్రజల ప్రాణాలుపోతే నాకేం బాధ అన్నట్లు వ్యవహరిస్తున్నది. డంపింగ్ కలుషిత ప్రభావిత ప్రాంతాలైన 18 గ్రామాల్లోని ప్రజలు చర్మ, సైనస్ వ్యాధులతో సతమతమవుతున్నారు..
చెత్తను తగ్గిస్తామంటూనే..
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు నగరంలోని నలువైపులా నుంచి చెత్తను సేకరించి లారీల్లో ఇకడకి తీసుకువస్తారు. 351 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ఉండగా, అధిక చెత్తను తీసుకురావడంతో పెద్ద గుట్టల్లాగా మార్చడంతో దుర్వాసన మరింత తీవ్రతరమైంది. దీంతో ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. జవహర్‌నగర్ ప్రాంతంలో నివసించే ప్రజలు పూర్తిగా పేదవారే ఉంటారు. రెకాడితేకాని డొకాడని స్థితిలో ఉండే వీరికి డంపింగ్ దుర్వాసనతో అనారోగ్యానికి గురై చేసిన కష్టం దవాఖానలకే సరిపోక అప్పుల్లో కురుకుపోతున్నారు.
భూగర్భ వ్యవస్థ నాశనం..
డంపింగ్ యార్డ్ కలుషిత జలాలతో సుమారు 10 కిలోమీటర్ల మేరకు పసుపు రంగుతో కూడిన జలాలే వస్తున్నాయి. భూగర్భ నీటిని ప్రజలు తాగలేరు.. స్నానానికి వాడలేరు.. అనే దుస్థితిలో నివసిస్తున్నారు. కలుషిత నీటితో పశుపక్షాదులు అనారోగ్యానికి లోనవుతున్నాయి. అనారోగ్య సమస్యలతో చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. చిన్న పిల్లలు ఎదుగుదల లోపంతో నష్టపోతున్నారు. వ్యవసాయ పంటలు వేసిన పూర్తిగా కలుషితమౌతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పట్టించుకోకుంటే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రసాయన నీటిని లిచెట్ ట్రిట్మెంట్తో మంచినీటిగా మార్చింది. కుప్పలుగా మార్చిన చెత్తను పచ్చటి వనంగా తీర్చిదిద్దింది. కాంగ్రెస్ సరారు ఏర్పడిన తర్వాత డంపింగ్ చెత్తపై పిచికారి కూడా సరైన పద్ధతిలో చేయడం లేదు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తపై నిత్యం కుకలు తిరుగుతూ స్థానిక ప్రజలపై తిరగబడుతున్నాయి. నిత్యం 150 లారీలకు పైగా వచ్చే చెత్తను ఎకడ పేర్చాలో తెలియక… చుట్టూ ఉండే ప్రజల అవస్థలు పట్టించుకోకుండా కాలనీల పకనే వేయడంతో ప్రజల ప్రాణాలకు విలువలేకుండా రాంకీ యాజమాన్యం వ్యవహరిస్తున్నది. ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు తిరగబడిన తీరుమార్చుకోకపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
పెరుగుతున్న లోడ్
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై లోడ్ పెరుగుతున్నది. ఇప్పటికే ఇకడ 14 మిలియన్ల చెత్తను క్యాపింగ్ చేశారు. సిటీలో రోజురోజుకు చెత్త పెరుగుతుండగా, డంపింగ్ యార్డ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైంది. డంపింగ్ యార్డ్ నిర్వహణ పనులు మొదలుపెట్టినప్పుడు గ్రేటర్ నలుమూలల నుంచి రోజుకు 2,500 – నుంచి 3 వేల టన్నుల చెత్త ఈ డంపింగ్ యార్డుకు వచ్చేది. గత ప్రభుత్వ హయాంలో డిమాండ్‌కు తగ్గట్లుగా నిర్వహణకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రేటర్లో రోజుకు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, అదంతా డంపింగ్ యార్డుకు తరలిస్తుండటంతో సమస్య పెరిగిపోతున్నది.
ఇకడ 24 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కొనసాగుతున్నది. 1200 టన్నుల చెత్త ఈ ప్లాంట్‌కి వెళ్తుంది. మిగతా చెత్తను రీసైక్లింగ్ చేసి ఎనర్జీ ప్లాంట్‌కి పంపేంత వరకు స్టోరేజీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇకడ మరో 24 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు కావాల్సి ఉంది. త్వరలో ఈ పనులు పూర్తవుతాయని బల్దియా అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా సమయం పట్టనున్నది. ఇక ఈ యార్డు సమస్యను పరిషరించేందుకు శివారు ప్రాంతాల్లో కొత్తగా డంపింగ్ యార్డ్ నిర్మాణాలకి సంబంధించి పనులు ముందుకు సాగడంలేదు.
ఒక దుండిగల్ ప్లాంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగతా చోట్ల ప్రతిపాదనకే పరిమితం అయ్యాయి. దీంతో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కొనసాగుతున్నది. ఇకడకు రోజూ 800 టన్నుల చెత్త వెళ్తుంది. దీంతో పాటు సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌లోని 152 ఎకరాల స్థలంలో 15 మెగా వాట్ల కెపాసిటీతో వేస్ట్ -టు -ఎనర్జీ ప్లాంట్‌పై న్యాయపరమైన చిక్కుల్లో నలిగిపోతున్నది. కాగా, గ్రేటర్లో ఉత్పత్తి అవుతున్న చెత్తలో కేవలం 2వేల టన్నుల వ్యర్థాలు మాత్రమే జవహర్‌నగర్‌తో పాటు దుండిగల్ ఎనర్జీ ప్లాంట్‌కు వెళ్తుంది. రోజూ 5500 టన్నుల చెత్త జవహర్‌నగర్‌లో మిగులుతోంది. దాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ నిర్వహణ లోపాలతో పాటు సామర్థ్యం సరిపోకపోవడంతో సగం చెత్తను డంపింగ్ ఫ్లోర్‌పైనే రాంకీ సంస్థ బహిరంగంగా పడేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతాల్లో ఇబ్బందులు..
డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వస్తూనే ఉంది. దుర్వాసన రాకుండా కెమికల్ స్ప్రే సరిగా చేయడం లేదు. యార్డ్ విస్తీర్ణం 351 ఎకరాలు ఉండగా, చుట్టు పకల 15 నుంచి 18 ప్రాంతాల్లో సమస్య ఉంది. జవహర్‌నగర్, ద మ్మాయిగూడ, కార్మికనగర్, బాలాజీనగర్ , గబ్బిలాలపేట, అం బేదర్నగర్, మలారం, రాజీవ్‌గాంధీ నగర్ , శాంతినగర్ , ప్రగతినగర్ , హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, బీజేఆర్నగర్ , అహ్మద్ గూడ, తిమ్మాయపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి ప్రాంతాలతో పాటు సాయంత్రమైందంటే యాప్రాల్, సైనిక్‌పురి, ఈసీఎల్ ప్రాంతాల్లో దుర్గంధం వస్తున్నట్లు జనం అంటున్నారు. వ్యర్థాల నిర్వహణలో లోపాలతో తమ బతుకులు ఆగమైతున్నాయని జనం లబోదిబోమంటున్నారు. వర్షాకాలం కావడంతో ఇబ్బందులు మరీ ఎకువయ్యాయని వాపోతున్నారు. రోజురోజుకు ఇబ్బందులు మరీ ఎకువయ్యాయని వాపోతున్నారు.
కలుషితమైన కార్మికనగర్‌లో బతుకుతున్నాం
కార్మికనగర్ పూర్తిగా కలుషితమైంది. డంపింగ్‌ను పకనే ఉండటంతో చెత్త కుప్పలు ఇండ్లపై పడిన సంఘటలు ఎన్నో చూశాం. డంపింగ్ వాసనతో ఆరోగ్యం పాడవుతున్నది. సాయంత్రం వేళల్లో దుర్వాసనను పీల్చలేక ఇంట్లోనే ఉండాల్సి వస్తున్నది. నీరు తాగాలన్నా రూ. 15పెట్టి కొనుగోలు చేయాల్సిందే .కూలీనాలీ చేసుకునే మాలాంటి పేదలు నీటిని కొనలేని దుస్థితిలో ఉంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోకుంటే మా బతుకులు ఆగమైతాయి. డంపింగ్ యార్డ్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుని మా కాలనీలను కాపాడాలి.
-నవీన్‌కుమార్, కార్మికనగర్ జవహర్‌నగర్
చర్మ, సైనస్ సమస్యలు..
దుర్గంధభరితమైన వాసన తగ్గితేనే మా ప్రాణాలు మిగులుతాయి. చర్మ, సైనస్ సమస్యలతో దవాఖానల చుట్టూ తిరగడానికే జీవితం సరిపోతుంది. ప్రమాణాలు పాటించకుండా రాంకీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నది. వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఏండ్ల నాటి నుంచి జీవనం సాగిస్తున్నాం. వర్షం పడుతుందంటే దుర్వాసనతో ఇండ్లల్లో ఉండ లేకుండా పోతాం. రాత్రివేళ పెద్దపెద్ద శబ్ధాలతో నిద్రపట్టదు. డంపింగ్ ప్రాంతంలో ఉండే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించిన దాఖాలాలు లేవు.
– మలాద్రి, వైఎస్ఆర్ నగర్ కాలనీ, జవహర్ నగర్