హైదరాబాద్ : సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ నీలోఫర్ హాస్పిటల్(Nilofar Hospital) రోగులతో(Patients) కిక్కిరిసిపోతున్నది. ఎమర్జెన్సీ వార్డులో(Emergency ward )బెడ్లు లేక రోగుల ఇక్కట్లు పడుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేకపోవడంతో చిన్న పిల్లల తల్లిదండ్రులు కింద కూర్చొని మరీ చికిత్స అందించుకుంటున్న దయనీయమైన దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఓకే బెడ్డు పై ముగ్గురు, నలుగురు పిల్లలను వైద్యులు పడుకోబెడుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.
ఇలా చేయడం వల్ల ఒకరి వ్యాధి మరొకరికి సోకే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిత్యం హాస్పిటల్కు వచ్చే రోగులసంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరల్ జ్వరాల బారిన పడుతూ జనం అవస్థలకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం దృష్టి పెట్టి ఎమర్జెన్సీ వార్డులో బెడ్లను సమకూర్చాలని రోగులు కోరుతున్నారు.
సీజనల్ వ్యాధులతో నిండుకుండలా మారిన ప్రభుత్వ నీలోఫర్ హాస్పిటల్
ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక రోగుల ఇక్కట్లు
ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక కింద కూర్చొని మరీ చికిత్స అందించుకుంటున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు
నీలోఫర్ హాస్పిటల్ రోగుల ఇక్కట్లు, సీజనల్ వ్యాధులతో డెంగ్యూ మలేరియా… pic.twitter.com/WScxYLAqNy
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2024