పటాన్చెరు, జూన్ 13: పటాన్చెవు (Patancheru) డివిజన్ పరిధిలోని శాంతి నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం శాంతినగర్లో డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ జామ్ కావడంతో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుందని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు. వెంటనే స్పందించిన ఆయన జీహెచ్ఎంసీ సిబ్బందిని పిలిపించి డ్రైనేజీ పూడికను తొలగించేలా చేశారు. గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీలో చెత్తా, చెదారంతో పేరుకుపోయింది. దీంతో రోడ్లపై మురుగునీరు పారుతున్నది.