పాస్పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తుదారులు పోటెత్తారు. సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ ద్వారా దరఖాస్తుదారులు.. పాస్పోర్ట్ సంబంధిత సందేహాలు, సమస్యలు పరిష్కరించుకుంటారు. అందులో భాగంగా గురువారం గ్రీవెన్స్ కావడంతో దరఖాస్తుదారులు పాస్పోర్ట్ కార్యాలయం నుంచి సుమారు కిలోమీటర్ మేర క్యూలైన్ ఉండటం గమనార్హం.
దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోలీసులు వారిని డబుల్ లైన్లో నిల్చోపెట్టడంతో పాస్పోర్ట్ కార్యాలయం దారి గుండా క్లాక్ టవర్ మీదుగా రైల్వే స్టేషన్ రూట్ వరకు భారీ క్యూలైన్ కనిపించింది.
– సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ)