వెంగళరావునగర్, ఏప్రిల్ 18 : అరిగిన బస్సు టైర్లు.. పని చేయని ఏసీ.. బస్సంతా దుర్గంధభరితం..హైదరాబాద్ నుంచి గోవాకు బయలుదేరిన డొక్కు బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బుక్ చేసిన బస్సు కాకుండా మరో బస్సులో ఎక్కించి మోసానికి పాల్పడ్డారంటూ తరుణి బస్సు ఆపరేటర్ తో వాగ్వాదానికి దిగారు. ఎల్బీనగర్ నుంచి గోవాకు వెళ్లే 25 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకా రం.. హైదరాబాద్ నుంచి గోవాకు ఏప్రిల్ 17వ తేదీన వెళ్లేందుకు ఏసీ బస్సును రెడ్ బస్ యాప్ ద్వారా కొంతమంది నేరుగా మరి కొందరు తరుణి లాజిస్టిక్స్ ను 25 మంది ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి గోవాకు ఏసీ బస్ టిక్కెట్ రూ.1543 వసూలు చేశారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 10 గంటల సమయానికి ఎల్బీనగర్ నుంచి బస్సు బయలుదేరింది. బస్సు లో ఏసీ కండిషన్ వ్యవస్థ లేదు. ఇంజన్ ఆయిల్ నుం చి లీకేజితోపాటు తీవ్ర దుర్గంధం వస్తుండటంతో ఎస్ఆర్నగర్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు ఆపి కిందకు దిగారు. బస్సు టైర్లు అరిగిపోయి ఉన్నాయి. అత్యంత ప్రమాదభరితంగా బస్సు ఉండటంతో ట్రా వెల్స్ బస్సు ఆపరేటర్‌తో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఎంపి45 జడ్ఈ 7529 బస్సు నెంబర్ టిక్కెట్ ఉందని..కానీ మరో బస్సు ఎంపి 45 జడ్ఈ7505 బస్సులో ప్రయాణికుల్ని ఎక్కించారని వాపోయారు.
తరుణి ట్రావెల్స్ నిర్వాహణ లోపం, మోసంపై నిలదీశారు. బస్సులో భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేశారని, తరుణి ట్రాన్స్ అండ్ లాజిస్టిక్స్ పై చర్యలు తీసుకోవాలని, లోపభూయిష్టమైన రెడ్ బస్ యాప్ నిర్వాహకులు బాధ్యత లేకుండా వ్యవహరించారని సిద్దిపేటకు చెందిన ఐటీ ఉద్యోగి ఎం.మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జీరో ఎఫ్ఐ ఆర్ కేసును నమో దు చేసి ఎల్బీనగర్ కు కేసును బదిలీ చేస్తున్నామని మధురానగర్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కొంత మంది ప్రయాణికులు మరో బస్సు బక్ చేసుకున్నారని మరి కొందరు రూఫండ్ ఇప్పించాలని ప్రయాణికులు వెళ్లిపోయారని ఇన్స్పెక్టర్ తెలిపారు.