వాహనదారుల కష్టాలు… ట్రాఫిక్‌తో ఆపసోపాలు
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన హెచ్ సిటీ ఫ్లైఓవర్ల ప్రాజెక్టు పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో సహా ట్రాఫిక్ ఉన్నతాధికారులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.
- కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయాణికుల అవస్థలు
- విస్తరణకు అవకాశాలున్నా మీనమేషాలు
- ఫలించని ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాలు
బంజారాహిల్స్, జూన్ 28: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన హెచ్ సిటీ ఫ్లైఓవర్ల ప్రాజెక్టు పనులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో సహా ట్రాఫిక్ ఉన్నతాధికారులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాకా పనులు జరుగుతుండడంతో అయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు వన్‌వే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందో చూసేందుకు ఆదివారం ట్రయల్ రన్ సైతం నిర్వహించినా సత్ఫలితాలు రాలేదు. ఏదో రకంగా వాహనదారుల కష్టాలు తీర్చాలనే లక్ష్యంతో పోలీసుశాఖ పనిచేస్తోంది. అయితే వారికి సహకరించాల్సిన జీహెచ్ఎంసీ మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ప్రధాన రహదారులపై చిన్న చిన్న మరమ్మతులు, ఫుట్‌పాత్‌ల తొలగింపు, రోడ్డుపై గుంతలు పూడ్చడం ద్వారా ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడాల్సిన జీహెచ్ఎంసీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లేదారిలో షాంగ్రిల్లా ప్లాజా వద్ద పనులు జరుగుతుండడంతో బాటిల్ నెక్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. దీన్ని పరిష్కరించాలంటే అక్కడ రోడ్డుకు ఎడమవైపు ఫుట్‌పాత్ మీద ఉన్న పబ్లిక్ టాయ్‌లెట్స్‌ను తొలగించి అక్కడే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించడం ద్వారా రోడ్డును విస్తరించే అవకాశం ఉంది. కనీసం అక్కడ రోడ్డుపై ఏర్పడిన గోతులు సైతం పూడ్చకపోవడంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.
- క్రీమ్ స్టోన్ వద్ద వాటర్ లాగింగ్ సమస్యలను తగ్గించేందుకు ఇటీవల జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు పైప్‌లైన్ వేయడంతో పాటు చాంబర్ నిర్మించారు. అయితే పనులు పూర్తయినా మట్టికుప్పలను రోడ్డుపక్కనే వదిలిపెట్టడంతో బిజీ సమయాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.
- జపనీస్ గార్డెన్ నుంచి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిదాకా ఫుట్‌పాత్‌ను తగ్గించి రోడ్డును విస్తరించేందుకు అవకాశం ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పక్కన ఫుట్‌పాత్‌ను మొత్తం అక్కడున్న కాఫీ షాపు నిర్వాహకులు వాడుకుంటున్నారు. దాన్ని తొలగించి రోడ్డును విస్తరిస్తే బాటిల్ నెక్ తగ్గిపోయి ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఎల్వీప్రసాద్ ఆస్పత్రి నుంచి పార్క్ హయత్ మీదుగా సాగర్ సొసైటీ దాకా ఫుట్‌పాత్‌ను వెనక్కి జరిపితే రోడ్డును కొంత విస్తరించే అవకాశం ఉంది. అయితే ఆ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
- సాగర్ సొసైటీ నుంచి కేబీఆర్ పార్కు మెయిన్ గేటుదాకా ఎడమవైపు ఫుట్‌పాత్‌పై ఉన్న కరెంట్ స్థంబాలు, తొలగించి రోడ్డును విస్తరించడంతో పాటు రోడ్డుపై గోతులను పూడ్చితే ట్రాఫిక్ సాఫీగా సాగే అవకాశం ఉన్పప్పటికీ హెచ్సిటీ ప్రాజెక్టు చేస్తున్న నిర్మాణ సంస్థగానీ, జీహెచ్ఎంసీ గానీ ఆ దిశలో ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
- బంజారాహిల్స్ రోడ్ నం.12లోని నీలోఫర్ హోటల్ నుంచి అగ్రసేన్ చౌరస్తా మీదుగా ఒమెగా ఆస్పత్రి దాకా రోడ్డు అత్యంత ఇరుగ్గా ఉంటుంది. ఈ రోడ్డుపై ఫుట్‌పాత్‌లను సరైన రీతిలో నిర్వహించడంతో పాటు అగ్రసేన్ చౌరస్తా తర్వాత రోడ్డు విస్తరణ చేస్తే వాహనాలు సాఫీగా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ పనులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై దృష్టి పెడితే వాహనదారుల కష్టాలు కొంతమేర అయినా తగ్గుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
- కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే రోడ్డులో చిచ్చాస్ వద్ద బాటిల్ నెక్కు కారణం నిరూపయోగంగా ఉన్న పబ్లిక్ టాయ్‌లెట్. దీన్ని అక్కడినుంచి తొలగిస్తే రోడ్డును విస్తరించే అవకాశం ఉంది. అయితే జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.
- జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ఫిలింనగర్‌కు వెళ్లే చౌరస్తాలో ఎడమవైపు సుమారు 15 అడుగుల విస్తీర్ణంలో ఫుట్‌పాత్ ఉంది. ఇక్కడ 15రోజుల క్రితం వీధిదీపాల పోల్స్ పాడేసి ఇప్పటికీ తొలగించలేదు. ఈ ఫుట్‌పాత్ విస్తీర్ణాన్ని తగ్గిస్తే చెక్‌పోస్ట్ వద్ద ఫ్రీ లెఫ్ట్‌లో వాహనాలు సాఫీగా వెళ్లే అవకాశం ఉందని, కానీ జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- కేబీఆర్ పార్కు ప్రధాన గేటు వద్ద కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తొలగించి చౌరస్తాను విస్తరిస్తే బాటిల్ నెక్ తొలగిపోయి ట్రాఫిక్ సాఫీగా సాగే అవకాశం ఉన్నప్పటీకీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

