అల్వాల్, జూలై 29 : అల్వాల్‌లోని సెయింట్ మైకేల్స్ పాఠశాలలో చిన్నారులను సెల్లార్లో కూర్చొబెట్టి పాఠాలు బోధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్కూల్ ఎదుట రెండు గంటల పాటు ఆందోళన చేశారు. పా ఠశాల యాజమాన్యం విద్యార్థులను చేర్పించేముందు అన్ని వసతులతో కూడిన తరగతి గదుల్లో కూర్చొబెడుతామని చెప్పి సెల్లార్లో కూర్చొపెట్టడడం ఏమిటని ప్రశ్నించారు.
యాజమాన్యం స్పందించకపోవడం తో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను శాం తింపచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ సె యింట్ మైకేల్స్ స్కూల్ యాజమా న్యం కనీస మౌ లిక వసతులు కల్పించకుండా కేవలం ధనార్జేనే ధ్యేయంగా యాజమాన్యం వ్యవహరిస్తుందన్నా రు. విద్యాశాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరా రు. ఎంఈఓ మురళీక్రిష్ణమూర్తిని వివరణ కోరగా వి ద్యార్థుల తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకురాలేదని, జిల్లా విద్యాశాఖాధికారి నుంచి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.