ఎలివేటెడ్ బాధితులకు సర్కార్ బెదిరింపులు
పరిహారం తేల్చలేదు. ప్రాజెక్టుకు భూములు సేకరించలేదు. కానీ ఎలివేటెడ్ కారిడార్ పేరిట బాధితులను రాష్ట్ర సర్కారు భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో రద్దు చేసిన భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే.. స్థానికులను భయపెట్టేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తుందని బాధితులు మండిపడుతున్నారు.
- కేసులు విత్ డ్రా చేసుకోవాలని హుకూం
- పరిహారం చెల్లించలేక సర్కార్ ఒత్తిడి
- 700 మంది భూ యజమానుల్లో ఆందోళన
సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : తాజాగా ప్యారడైజ్-రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ బాధిత ఆస్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కోలుకోలేని షాకిచ్చింది. భూసేకరణకు సంబంధించిన సెక్షన్-19 ఫైనల్ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని బేఖాతరు చేస్తూ హెచ్ఎండీఏ, ప్రభుత్వ యంత్రాంగం ముందడుగు వేయడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు న్యాయస్థానం తీర్పుతో బాధితులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో, మరోవైపు కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు, పర్యటనలు చేసి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఎన్‌హెచ్-44, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ మార్గంలోని రాజీవ్ రహదారిలోని ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ ప్రాంతాల్లోని బాధితులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నది.
కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న యంత్రాంగం..
ఇటీవల దీనిపై హైకోర్టు పరిధిలో విచారణ సాగిన సమయంలో యంత్రాంగం కోర్టును తప్పుదోవ పట్టించినట్లుగా వ్యవహారిస్తుందనీ బాధితులు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న 700 కేసుల విషయంలో సర్కారుతో ఇప్పటి వరకు తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. పరిహారం కూడా తేల్చకుండా ప్రాజెక్టుకు సహకరించేది లేదనీ ఓవైపు బాధితులు చెబుతుంటే… సర్కార్ యంత్రాంగం మాత్రం కేసుల అన్ని విత్ డ్రా అవుతున్నాయంటూ కోర్టును తప్పుదోవ పట్టిసున్నారని ఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టు ఉన్నత న్యాయ స్థానం జోక్యం చేసుకుని, నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉన్న జాబితా, ప్రస్తుతం వివాదంలో ఉన్న కేసుల వారీగా వివరాలను సేకరించి నిజానిజాలను బట్టబయలు చేయాలని జేఏసీ నాయకులు తేలుకుంట సతీష్ స్పష్టం చేశారు.
అధికారుల తీరుపై మండిపడ్డ జేఏసీ
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ భూసేకరణ, స్వాధీనం, కూల్చివేతలకు పాల్పడితే ఊరుకునేది లేదని రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ బాధితులు డిమాండ్ చేశారు. సెక్షన్-19 నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆపరేటివ్ ఆదేశాల పరిధిని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రద్దు చేసిన నోటిఫికేషన్ ఆధారంగా బాధితుల ఆస్తులను లాకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తుంగలో తొకి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే, బాధితులకు న్యాయమైన పరిహారం చెల్లించకుండా, కోర్టు ఆదేశాలను ఏమార్చుతూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై స్థానిక ఆస్తిదారులు, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పరిహారం తేల్చాలని, ఒకే ప్రాజెక్టులో వేర్వేరుగా పరిహారాన్ని ఎందుకు నిర్ణయిస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

