బాలానగర్, నవంబర్ 4 : జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ ఉప ఎన్నిక ఇన్చార్జి కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రచారంలో భాగంగా నేతాజీనగర్, శంకర్లాల్నగర్, సుల్తాన్నగర్లో ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్తో కలిసి ఉప ఎన్నిక ప్రచారాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారం ముమ్మరం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డితోపాటు సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజ నర్సు బృందం, ఎర్రగడ్డ డివిజన్ నాయకులతో కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ, బాలానగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.