నాంపల్లిలోని నుమాయిష్లో కొలువుదీరిన హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటున్నది. ఈనెల 14న ప్రారంభమైన ప్రదర్శన ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది. 15 మంది ఆర్టిస్టులు వేసిన పెయింటింగులను ఎంపిక చేసి ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా ప్రింట్మేకింగ్, పెయింటింగ్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందర్శకులు వాటిని వీక్షిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– సిటీబ్యూరో, మార్చి 16 ( నమస్తే తెలంగాణ)