పహాడీషరీఫ్, మార్చి 26: కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాలను దర్శించుకుని తమ కుటుంబాలు చల్లగా ఉండాలని పూజలు చేస్తున్నారని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకుడు కార్తిక్‌రెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ బాబా షర్ఫుద్దీన్, జల్పల్లిలోని బాబా ఫకృద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా సందల్ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. జల్పల్లిలోని బాబా షర్ఫుద్దీన్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో కార్తిక్‌రెడ్డి పాల్గొని దర్గాకు చాదర్, పూలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి కో-ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, పహాడీషరీఫ్ దర్గా ముతవల్లి షకీల్, టీఆర్ఎస్ నాయకులు యంజాల జనార్దన్, షేక్ అఫ్జల్, జహంగీర్, సైఫ్ పటేల్, సయూద్ పటేల్, జంగారెడ్డి, నజీం పటేల్, పహాడీషరీఫ్ డీఐ కాశీ విశ్వనాథ్, ఎస్సైలు ప్రభులింగం, మధుసూదన్, నయూముద్దీన్, అజయ్, భక్తులు పాల్గొన్నారు.