దుండిగల్, మే 24: ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి సల్ప గాయాలైన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీ సుందర్‌నగర్‌కు చెందిన కోటాల రాజశేఖర్ (24) ప్రైవేట్ ఉద్యోగి. ఈ నెల 23న రాత్రి 8గంటల సమయంలో స్నేహితుడు దినేశ్‌తో కలిసి తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు.
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బహదూర్‌పల్లిలోని టెక్‌మహీంద్ర సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో రాజశేఖర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న దినేశ్‌కు స్వల్ప గాయాలు కావడంతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.