అల్లాపూర్, అక్టోబర్19: బోరబండ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గోపన్న చేసిన సేవలు మరువలేనివని, మాగంటి సునీతమ్మకే మా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు వారికి భరోసా ఇచ్చారు. అంతకు ముందు డివిజన్ పరిధిలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గన్నారు.