ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 29: ఉస్మానియా యూనివర్సిటీలో స్పోర్ట్స్ క్లస్టర్ ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అడ్డుకునేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించారు. కేంద్ర ఫెలోషిప్‌లు పొందేందుకు నెట్ అర్హతను తప్పనిసరి చేస్తూ విధించిన నిబంధనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ టీఎస్ ఆధ్వర్యంలో కిషన్‌రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ఫెలోషిప్‌లు పొందేందుకు నేషనల్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి అనే నిబంధనను రూపొందించి, దళిత విద్యార్థులకు పరిశోధనలను దూరం చేశారని మండిపడ్డారు.