ఉస్మానియాయూనివర్సిటీ, ఆగస్టు 20: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటిపారుదల రంగ అభివృద్ధిపై ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు హిస్టరీ విభాగం హెడ్ ప్రొఫెసర్ అర్జున్‌రావు కుతాడి ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇరిగేషనల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ – ఏ హిస్టారికల్ పర్స్పెక్టివ్’ అనే అంశంపై ఈనెల 23న ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.