ఉస్మానియా యూనివర్సిటీ, ఆగ స్టు 7: సాంకేతిక అభివృద్ధి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చినపు డే దాని విలువ పెరుగుతుందని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) మాజీ డైరెక్టర్, ప్రస్తుత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్ఎస్ టీ) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వైవీఎన్ కృష్ణమూర్తి అన్నారు. ఉస్మానియా వర్సిటీ జాగ్రఫీ విభాగం, ఇండియన్ జాగ్రఫికల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎర్త్ సైన్సెస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’పై 3 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. శనివారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కృ ష్ణమూర్తి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో చదువుకున్న వారి ప్రాధాన్యత అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. డేటా, టెక్నాలజీలను ఉపయోగిస్తూ సామాజిక పరిశోధనలు మరిన్ని జరగాల న్నారు. అవి సమాజ అభివృద్ధికి తో డ్పడాలని ఆకాంక్షించారు. సదస్సు లో ఇంగ్లండ్, శ్రీలంక, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, రష్యా, జర్మనీ దేశాల నుంచి పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించా రు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు బాలకిషన్, నగేశ్, కేరళ రాష్ట్రం నుంచి అ జిత్, అక్తర్, ఆనంద్ పాల్గొన్నారు.