సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులందరికీ బహుళ ప్రయోజనాలు ఉన్న స్మార్ట్ ఐడెంటిటీ కార్డు జారీ చేయడంపై అధికారులు చర్యలు వేగవంతం చేశారు. క్లాస్ రూమ్‌లో విద్యార్థుల అటెండెన్స్, పరీక్షల నిర్వహణ, హాస్టల్ అడ్మిషన్, లైబ్రెరీ ప్రవేశాల కోసం మల్టీ పర్సప్ స్మార్ట్ ఐడెంటిటీ కార్డులను జారీ చేస్తున్నట్లు ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్డుల జారీ ప్రక్రియ 2021-22 విద్యా సంవత్సరంలోనే అమలులోకి వస్తుందన్నారు. ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి విద్యార్థులందరికీ స్మార్ట్ ఐడీలు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకుగాను అన్ని రకాల కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆధార్‌తో.. స్మార్ట్ ఐడీ కార్డులను అనుసంధానం చేసి జారీచేయనున్నారు. ఇప్పటికే ఓ ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్‌తో సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయన్నారు.
కార్డు ద్వారానే అటెండెన్స్..