Osmania Medical College | సుల్తాన్ బజార్, ఆగస్టు 8: ఉస్మానియా మెడికల్ కళాశాలకు ఐఎస్వో 9001-2015 గుర్తింపు దక్కింది. ఈ మేరకు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఐఎస్వో గుర్తింపు సంస్థ ప్రతినిధి శివయ్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్రకుమార్‌కు గురువారం గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తెలంగాణలో రెండోసారి ఉస్మానియా మెడికల్ కళాశాల ఐఎస్వో గుర్తింపును పొందడం అభినందనీయమన్నారు.
కళాశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, భద్రతా సామర్థ్యంతో పాటు గ్రీన్ ఎన్విరాన్మెంట్లో మంచి బోధనను అందిస్తున్నామన్నారు. కళాశాలలోని అన్ని స్థాయి ఉద్యోగుల కృషి వల్లే కళాశాలకు రెండోసారి ఐఎస్వో గుర్తింపు లభించిందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ శంకర్, డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు.