హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం నాడు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ఇక్కడ సీటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్ను కూడా హరీశ్ రావు ప్రారంభిస్తారు.
అలాగే 8 కోట్ల రూపాయలతో ఉస్మానియా ఆస్పత్రిలో క్యాథ్ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని కూడా హరీశ్ రావు ప్రారంభిస్తారు. ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టనున్నారు.