Organ Donation | బేగంపేట జూన్ 9: అవయవదానంపై ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో అవగాహన పరుగు నిర్వహించారు. సంజీవయ్య పార్కు నుంచి 10కే, 5కే రన్ సాగింది. మోహన్ ఫౌండేషన్ సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ భానుచంద్ర, బ్రిల్స్ సీఈవో రామ్‌నరేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ 10కే రన్ రెండో ఎడిషన్ పేరిట రన్ ఫర్ ఆర్గాన్ అవేర్నెస్ పరుగులో పలువురు రన్నర్స్,
వైద్యులు, యువతీయువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరణించినా..అవయవదానం ద్వారా మరొకరికి జీవితాన్ని ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు నిలుపవచ్చని పలువురు పేర్కొన్నారు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంచడంతో పాటు కొందరిలో ఉన్న అపోహలను పోగొట్టేందుకు ఈ అవగాహన రన్ నిర్వహించినట్టు నిర్వాహకులు వెల్లడించారు.