ముషీరాబాద్, మార్చి 14: బ్రాండెడ్ తో చనిపోయిన తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చింది ఓ మాతృమూర్తి. అవసరం ఉన్నవారికి అవయవాలు దానం చేసి తన కుమారుడిని వారి లో చూసుకోవాలని ఉదారతతో ముందుకు వచ్చింది. అడిక్ మెట్కు చెందిన బెల్లం సుధాకర్ (40) కథ బుధవారం రాత్రి ఇంట్లో ప్రమాదవశాత్తు పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడి తల్లి బెల్లం సరో జ నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించింది.
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. వారం రోజులుగా శస్త్ర చికిత్సలు చేసినప్పటికీ ఫలి తం లేకపోగా శుక్రవారం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించా డు. కుమారుడు చనిపోవడంతో కన్నీ టి పర్యంతం అయిన తల్లి తన కుమారుడి కళ్లు, కిడ్నీ, లివర్, గుండె తదితర అవయవాలను అవసరం ఉన్నవారికి దానం చేయాలని నిర్ణయించింది. అవయవాలను తీసుకోవడం కోసం అపోలో ఆసుపత్రి యాజమా న్యం అంగీకరించింది. దీంతో అతని అవయవాలు సేకరించిన ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని కుటుం బ సభ్యులకు అప్పగించింది.