ఖైరతాబాద్, ఫిబ్రవరి 14: తాను మరణించినా అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. జగిత్యాల జిల్లా గొడిసెలపేటకు చెందిన రాజేందర్‌రెడ్డి (35) రైతు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా బ్రెయిన్ స్టోక్ వచ్చింది.
దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఈ నెల 13న బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా, అందుకు అంగీకరించారు. ఆయన శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించినట్లు జీవన్‌దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపారు.