Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Bhargav Desh Pande | రాహుల్‌గాంధీ ఢిల్లీలో ఒక మాట చెప్తరు.. రాజ్యాంగం గురించి మాట్లాడుతరు.. విద్యార్థులకు, యువకులకు భావస్వేచ్చ గురించి మాట్లాడతారు.. రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్పే మాటలకు తెలంగాణలో పూర్తి విరుద్ధంగా పాలన నడుస్తుందన్నారు.
Bhargav Desh Pande | ఒక 17-18 ఏండ్ల యువకుడిగా మేమందరం కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యూఐ జెండా పట్టుకొని బయలుదేరినం. ఆరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరే. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో అక్కడ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరేనని మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్, ఆదిలాబాద్ జిల్లా యువనాయకుడు భార్గవ్ దేశ్ పాండే
బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీరు 2017-18 సంవత్సరాల నుంచి చూస్తే ముఖ్యంగా రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చినంక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పంథా అనేది పూర్తిగా మారిపోయిందన్నారు భార్గవ్ దేశ్ పాండే. ఇన్నేళ్లు పనిచేసిన కార్యకర్తగా, నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిని అయిన.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు అయిన. ఏఐసీసీ మెంబర్‌గా 10 సంవత్సరాలున్నా.. కానీ ఈ రోజు మేమేదైతే ఆలోచించుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాదు. పూర్తిస్థాయిలో ఈ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, ఆర్ఎస్ఎస్, బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నదన్నారు. అక్కడ రాహుల్‌గాంధీ ఢిల్లీలో ఒక మాట చెప్తరు.. రాజ్యాంగం గురించి మాట్లాడుతరు.. విద్యార్థులకు, యువకులకు భావస్వేచ్చ గురించి మాట్లాడతారు.. రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్పే మాటలకు తెలంగాణలో పూర్తి విరుద్ధంగా పాలన నడుస్తుందన్నారు.
నేను 2006 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.. ఆరోజు ఉన్న కాంగ్రెస్ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఈ ముగ్గురు పూర్తిగా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారు. కేవలం రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎందుకు టీడీపీని అధికారంలోకి తీసుకురాలేదు.. ?ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు ఐదుగురు తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు.. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. తెలుగుదేశం, RSS కాంగ్రెస్ అని మండిపడ్డారు. లీవ్ కాంగ్రెస్.. సేవ్ తెలంగాణ అని భార్గవ్ దేశ్ పాండే నినదించారు.
టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాలు ఉన్న నాయకుల చెప్పుచేతల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది
నేను 2006 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.. ఆరోజు ఉన్న కాంగ్రెస్ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్
ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఈ ముగ్గురు పూర్తిగా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయారు
రాహుల్ గాంధీ ఢిల్లీలో చెప్పే మాటలకు తెలంగాణలో పూర్తి విరుద్ధంగా పాలన నడుస్తుంది
కేవలం రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎందుకు టీడీపీని అధికారంలోకి తీసుకురాలేదు?
ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు ఐదుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు
ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. తెలుగుదేశం, RSS కాంగ్రెస్
లీవ్ కాంగ్రెస్.. సేవ్ తెలంగాణ
– మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్‌పాండే
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2026
Read Also :
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

