కాచిగూడ,జూన్ 18 : కేంద్ర ప్రభుత్వ అమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో ఆన్లైన్లో కంప్యూటర్ శిక్షణ,సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో( Cyber Ethical Hacking Courses) ఆన్లైన్లో(Online Training) శిక్షణకై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల యువతి, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమాన్‌రెడ్డి తెలిపారు.
మంగళవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇన్మఫర్మేషన్ రంగం, ఆర్కిటెక్ట్,సెక్యూరిటీ విభాగం, మిషన్ లెర్నింగ్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైన్స్, బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటర్, జావా, ఒరాకిల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వన్నుట్లు తెలిపారు. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ చదివిన యువకులు ఈ నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9505800050, ఆన్లైన్లో www.nationalskillacademy.inలో సంప్రదించవచ్చని సూచించారు.