శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Jun 19, 2020 , 00:54:23

‘ప్రభుత్వ’ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు!

‘ప్రభుత్వ’ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు!

  •  యూట్యూబ్‌ చానల్‌ ఏర్పాటు
  •  ఈ నెలాఖరుకు తరగతులు ప్రారంభం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇక ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించనున్నారు. కలెక్టర్‌ శ్వేతామహంతి ఆదేశాలతో హైదరాబాద్‌ డీఈవో వెంకటనర్సమ్మ యూట్యూబ్‌ చానల్‌ను ఏర్పాటు చేశారు.  ఈ నెల చివరివారంలో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వీలుగా పాఠాలు బోధించే ఉపాధ్యాయుల ఫోన్‌ నంబర్లు  అందిస్తారు. తొలుత  పది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు, అనంతరం మిగిలిన తరగతులకు ఆన్‌లైన్‌ బోధనను అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థులకు మరింత సులువుగా ఉండేవిధంగా వెబ్‌సైట్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రికాైర్డెన పాఠాలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటాయి.