సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే రెండింతల నుంచి మూడింతల లాభాలు ఇప్పిస్తామంటూ ఆశపెట్టి ఆన్లైన్లో మోసం చేసిన వ్యక్తిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఫిర్యాదుదారుడికి ఇటీవలటీనామిట్టల్ నుంచి పెట్టుబడి సలహా కోసం వాట్సప్ గ్రూపులో చేరమని సలహా ఇచ్చారు.
బాధితుడు ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే కొద్దిరోజుల తర్వాత బాధితుడు డిపాజిట్స్ ఉపసంహారించుకోవడానికి ప్రయత్నిస్తే మొత్తం డిపాజిట్లో 5శాతం చెల్లించమని అడిగారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనేరంలో పాలుపంచుకున్న తిలక్‌నగర్‌కు చెందిన పకీర్ శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. శ్రీనివాసరెడ్డిపై దేశవ్యాప్తంగా ఐదు కేసులున్నాయని పోలీసులు తెలిపారు.