సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ ) : ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హాస్టళ్లపై(Hostels) ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యలు(Food safety checks) కొనసాగుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా మాదాపూర్ పరిధిలోని హాస్టళ్లపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పలు ఉమెన్స్ హాస్టళ్లపై దాడులు చేపట్టారు. సింధు జడ్డు ఉమెన్స్ హాస్టల్లో డస్ట్బిన్లకు మూతలు లేకుండా ఉండడాన్ని గుర్తించారు.
గడువు ముగిసిన మిరప పొడిని సీజ్ చేశారు. ఓం శ్రీ సాయి నేత్రం డిలక్స్ ఎక్స్ మీల్లో వండేటప్పుడు వడ్డిస్తున్నప్పుడు గుట్కా నమిలే కార్మికులు, సింథటిక్ రంగుల వాడకం, కుళ్లిన కూరగాయలు, బొద్దింకలు, తుప్పు పట్టిన దోస పెనం, ఆపరిశ్రుభత వాతావరణంలో వంట గది, సోయా సాస్ గడువు ముగియడం, తనుశ్రీ గ్రాండ్లో బొద్దింకలు, ఓపెన్ డస్ట్బిన్లతో అపరిశుభ్రమైన వంటగది, టొమాటో సాస్, చిల్లీ సాస్ నమూనాలు స్పాట్ టెస్టులో విఫలమయ్యాయి. ఓం శ్రీ సాయి నంద ఉమెన్స్ హాస్టల్స్లో మూతలు లేకుండా డస్ట్బిన్లను తెరిచి ఉంచినట్లు గుర్తించారు. ఎస్ఆర్ లేడీస్ హాస్టల్స్లో పని ప్రదేశం, రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు, బియ్యం, కారం, పసుపు పొడి నమూనాలను సేకరించారు. సంబందిత హాస్టల్స్ యాజమానులకు నోటీసులు జారీ చేశారు.